– జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సుదర్శన్
– పాఠ్య పాఠ్యపుస్తకాల్లోని విజ్ఞానాన్ని నిత్యజీవిత వినియోగానికి
– అనుకూలంగా మలచుకోవాలి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
శాస్త్రీయ ఆలోచనలను విద్యార్థులు పెంపొందించు కోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సుదర్శన్ అన్నా రు. జనవిజ్ఞానిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబు రాలు(జిల్లా స్థాయి ప్రతిభ పరీక్ష) వికారాబాద్ పట్టణం లోని జడ్పీహెచ్‌ఎస్ బార్సు స్కూల్‌లో శనివారం జరిగా యి. జిల్లా వ్యాప్తంగా 13 టీములు పాల్గొన్నాయి. ము గింపు కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సుద ర్శన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడు తూ.. నేటి బాలలే రేపటి పౌరులు, శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకుని, పరిపూర్ణ మానవులు గా ఎదగాలని, రాజ్యాంగంలోని 51 ఏహెచ్‌ను అవగా హన చేసుకోవాలని దీనివల్ల పరిసరాల్లో సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను ప్రశ్నించడం, పరిష్కా రాలు వెతకుతామని తెలిపారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ.. ఆదిమానవుని కాలంలో చెకుముకి రాయి ద్వారా వెలువడిన నిప్పు అజ్ఞా నం నుండి విజ్ఞానం వైపు సమాజాన్ని తీసుకుపోవడానికి ఎంతగానో ఉపయోగపడిందని, అది ఆరోజుల్లో ఒక గొప్ప మార్పు అని తెలిపారు. నేటి చెకుముకి ప్రతిభా పరీక్షలు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం శాస్త్రీ ఆలోచనలు చిన్న వయసులోనే అలవాటు చేసుకోవడానికి అవసర పడతాయని, విద్యార్థులు తమ పాఠ్య పాఠ్యపుస్తకాలలోని విజ్ఞానాన్ని నిత్యజీవిత వినియో గానికి అనుకూలంగా మలచుకోవాలని చెప్పారు. శనివారం జరిగిన ప్రతిభా పరీక్ష పోటీల్లో విజేతలుగా ఎంపికైన టీంలు ఫిబ్రవరి 9,10, 11 తేదీల్లో జనగామ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబురాల్లో పాల్గొనను న్నాయి. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విజే తల వివరాలు ప్రభుత్వ ఆంగ్ల మీడియం విభాగం నుంచి ఎంజెపీటీ సీడబ్ల్యూఆర్, కొడంగల్ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల తెలుగు మీడియం విభాగం నుంచి శ్రీ బాలాజీ కేజీహెచ్‌ఎస్ కొడంగల్ విద్యా ర్థులు ప్రైవేట్ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం విభాగం నుంచి కృష్ణవేణి టాలెంట్ స్కూల్, పరిగి విద్యార్థులు విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక వికారాబాద్ జిల్లా నాయకులు రత్నం, అబ్దుల్ కవి, శ్రీనివాసులు, పుష్పలత, నవీన్ కుమార్, స్థానిక పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.