– సైంటిస్ట్ రఘునందన్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి ఆధ్వర్యంలో బాలోత్సవం
నవతెలంగాణ-మియాపూర్
పిల్లల శాస్త్రీయ ఆలోచన పెంపొందించాలని సైంటిస్ట్ రఘునందన్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, గచ్చిబౌలి ఆధ్వర్యంలో బాలోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్లానేటరీ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు రఘునందన్ హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో ప్రశ్నిచే తాత్వాన్ని అలవర్చుకో వాలని అన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలన్నారు. గ్రహా లు, గ్రహనాలపై ఉన్న అపోహలు తొలగిచుకోవాలని సమాజ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం పిల్లల్లో సృజ నాత్మకతను పెంచే కార్యక్రమాలను నిర్వహించటం అభినందనీయం అన్నా రు. ఈ సందర్బంగా పిల్లలు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు 550 మంది పాల్గొన్నారు. భాద్యులు ఆర్.సాంబశివ రావు, విజరుకుమార్, శ్రీనివాస్ రావు, రవీందర్, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.