
ఈ ఏడాది గెలలు దిగుబడి తగ్గుదలకు వాతావరణ అననుకూల పరిస్థితులే కారణం అని రిటైర్డ్ ప్రిన్సిపుల్ సైంటిస్ట్ బీఎన్ రావు అన్నారు. ఆయిల్ ఫాం సాగు యాజమాన్య పద్దతులు పై రైతులకు అవగాహన కలిగించారు. స్థానిక ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రైతులు కే.పుల్లయ్య,మొగళ్ళపు చెన్నకేశవ రావు,అధికారులు రాజశేఖర్ రెడ్డి, సూర్యనారాయణ,బాలక్రిష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆలపాటి రామచంద్ర రావు ఆయిల్ ఫాం క్షేత్రాలను పరిశీలించారు.