పంటలు పరిశీలించిన శాస్త్రవేత్తలు పురుగుల నివారణ కోసం రైతులకు సూచనలు

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలంలో మద్నూర్ గ్రామ శివారులో సాగుచేసిన వానకాలం పంటలను కేంద్రీయ సస్యరక్షణ కేంద్రం శాస్త్రవేత్తలు  శ్రీమతి నీల రాణి , రవి శంకర్ శాస్త్రవేత్తలతో పాటు మండల వ్యవసాయ అధికారి రాజు ఏఈవోలు కలిసి  సోయాబీన్ ,పెసర, మినుము, కంది, పత్తి, పంటలను పరిశీలించిడం జరిగింది. ప్రస్తుతం సోయా , పంటలలో  రసం పిలిచే పురుగు , పొగాకు  లద్దే పురుగు, కాండం ఈగ ఆశించే అవకాశం ఉందని గమనించటం జరిగింది.
నివారణకు రసం పిలిచే పురుగు తెల్ల దోమ, పచ్చ దోమ ఉన్నట్లతే ఏసిఫేట్ 300గ్రాము ఒక ఎకరాకి, లద్దే పురుగు ఉన్నట్లయితే ఏమనెక్టిన్ బెంజయేట్ 80గ్రాము ఎకరాకు, అలాగే కాండం ఈగ గమనిచట్లైతే తొలి దశలో  మొక్క వదిలిపోయి ఉండి ఆకులు రాలిపోయి పోతే ఏసైఫేట్ 300గ్రాము ఎకరాకు ,కాండం తొలిచే పెంకు  పరుగు ఉన్నట్లయితే క్వినల్ఫాస్, లేదా ప్రోపినోఫాస్ 400గ్రాము మందుని ఎకరాకు పిచికారీచేసుకోవాలి. వ్యవసాయదారులకు సూచించారుఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, ఏ ఈ ఓ ప్రియాంక, రైతులు దరాస్ సాయులు, వినోద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.