నవతెలంగాణ -శంకరపట్నం: స్కూటీ అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలు వివరాల్లోకి వెళితే తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన వాంకిడి బాబు(31) పర్లపల్లి నుండి కొత్తగట్టుకు వెళ్తుండగా శ్రీ లక్ష్మీ ప్రసన్న గార్డెన్ దగ్గర స్కూటీ స్కిడ్ అవడంతో స్కూటీ మీద ప్రయాణిస్తున్న వాంకిడి బాబు,తాటిపల్లి పవన్, లు కింద పడడంతో వాంకిడి బాబుకు కుడి చెవిలో నుండి బ్లీడింగ్ అయ్యి కింది పెదవి గదవ కు దెబ్బలు తగిలాయి. పవన్ కు స్వల్ప గాయాలు అవడంతో ఇద్దరూ రోడ్డు మీద పడడంతో స్థానికులు 108 కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ కాజా ఖలీల్ ఉల్లా,లు క్షతగాత్రులని అంబులెన్స్ లోకి తీసుకుని ప్రధమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించినట్లు సిబ్బంది తెలిపారు.