ప్రతి పాఠశాలలో స్కౌట్ యూనిట్లు ఏర్పాటు చేయాలి

Scout units should be formed in every school– ఉపాధ్యక్షులు కాంచనవల్లి రత్నాకర్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో తప్పనిసరిగా స్కౌట్ అండ్ గైడ్స్ యూనిట్లు ఏర్పాటు చేయాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కాంచనవల్లి రత్నాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం పలు పాఠశాలను సందర్శించి యూనిట్ రిజిస్ట్రేషన్ లను చేపట్టారు. 2024-25  సంవత్సరానికి  కొత్త యూనిట్ల నమోదు, పాత యూనిట్ల రెన్యువల్ చేపట్టడంలో భాగంగా గత రెండు రోజులుగా యూనిట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో ఈ బాలబట ఉద్యమాన్ని బలోపేతం చేసేలా స్కౌట్ అండ్ గైడ్స్ యూనిట్ ల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి ఎన్.స్వామి ఉన్నారు.