నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు ఈనెల ఎనిమిదో తేదీన హైదరాబాద్‌లోని నాంపల్లి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. వెబ్‌సైట్‌లో పొందుపురిచిన అన్ని ధ్రువపత్రాలనూ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎవరైనా అభ్యర్థులకు ఒరిజినల్ ధ్రువపత్రాలు తెచ్చుకోకుంటే వారికి ఆ తర్వాత పరిశీలన చేయబోమని స్పష్టం చేశారు. ఎవరైనా అభ్యర్థులు గైర్హాజ రైతే వారు తర్వాత ప్రక్రియలో పాల్గొనడానికి అవకాశం లేదని తెలిపారు.