నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గురువారం ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న టీజీపీఎస్సీ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ ఏడో తేదీన టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.