డిగ్రీ దోస్త్ ఆన్లైన్ ప్రత్యేక కేటగిరి వారికి 13న ధ్రువపత్రాల పరిశీలన..

నవతెలంగాణ-డిచ్ పల్లి
దోస్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి 2024 -25 సంవత్సరానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో  ధ్రువపత్రాల పరిశీలన  అకాడమిక్ ఆడిట్ సెల్ లో  13 గురువారం ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని దోస్త్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ కే.సంపత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిహెచ్ సి (దివ్యాంగులు) / సిఏపి / ఎన్సిసి / ఎక్సట్రా కర్రీక్యూలర్ ఆక్టివిటీస్ విద్యార్థులకు  మాత్రమే సర్టిఫికెట్లు పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు.