
నవతెలంగాణ- అశ్వారావుపేట: సోమవారం జరిగిన నామినేషన్ పరిశీలనలో భాగంగా 23 మంది అభ్యర్థులకు గాను ఇరువురు అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు తిరస్కరించారు. సీపీఐ(ఎం) డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన గోగ్గెల ఆదినారాయణ బి.ఫాం సమర్పించుకోవడం, బహుజన ముక్తి పార్టీ కి చెందిన అభ్యర్ధి దారావతు హనుమంతరావు దరఖాస్తు సంపూర్ణంగా లేకపోవడం తిరస్కరణకు గురైనట్లు ఎ.ఇ.ఆర్.ఒ, తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్ తెలిపారు. దీంతో 21 మంది నామినేషన్ లు ఆమోదం పొందాయి. ఇక ఉపసంహరణ మిగిలింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) అభ్యర్ధి పిట్టల అర్జున్, ఎన్నికల ఇంచార్జి కొక్కెరపాటి పుల్లయ్య, బిఎస్పీ అభ్యర్ధి మడకం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.