– 18 నుంచి 22 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు
– 25న సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో 2023-25 బ్యాచ్ ప్రవేశాల కోసం నిర్వహించిన డీసెట్-2023 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈనెల 17న ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ ఎస్ శ్రీనివాసాచారి గురువారం రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొదటి విడతలో హాజరు కాని అభ్యర్థులు ఈనెల 17న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. ఈనెల 18 నుంచి 22 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని వివరించారు. 25న సీట్లు రెండో విడత కేటాయిస్తామని పేర్కొన్నారు. 26 నుంచి 29 వరకు ఫీజు చెల్లించి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. ఈనెల 31న రెండోవిడత సీట్ల కేటాయింపు తర్వాత స్లైడింగ్ (సీట్లు మార్చుకోవడానికి) అవకాశముందనీ, అదేరోజు మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. వచ్చేనెల ఒకటి నుంచి మూడో తేదీ వరకు ఫీజు చెల్లించి కేటాయించిన కాలేజీల్లో చేరాలని సూచించారు.