రేపు డీసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన

– 30న సీట్ల కేటాయింపు
– మొదటి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఎలిమెం టరీ ఎడ్యుకేషన్‌ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో 2023-25 బ్యాచ్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన డీసెట్‌-2023 కౌన్సెలింగ్‌ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు డీసెట్‌ కన్వీనర్‌ ఎస్‌ శ్రీనివాసాచారి మొదటి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూ ల్‌ను సోమవారం విడుదల చేశారు. గతంలో హాజరు కాని వారికి బుధవారం ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 22 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశముందని వివరిం చారు. 30న సీట్లు కేటాయి స్తామని పేర్కొన్నారు. వచ్చేనెల ఒకటి నుంచి మూడు వరకు ఫీజు చెల్లించి అడ్మిషన్‌ లెటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకో వాలని సూచించారు. అదేనెల ఐదున కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. ఎనిమిదిన కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన తరగతులుంటాయని తెలిపారు. డీసెట్‌కు మొత్తం 6,485 మంది దరఖాస్తు చేస్తే, 5,150 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. వారిలో 3,975 (77.18 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.