ప్రారంభం అయిన ప్రజాపాలన దరఖాస్తులు పరిశీలన…

– నాలుగు బృందాలు.. మొదటి రోజు 204 పరిష్కారం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు రూ.500 లు కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని కృతనిశ్చయంతో ఉంది.ఈ క్రమంలో నియోజక వర్గం కేంద్రం అయిన మేజర్ పంచాయితీ అశ్వారావుపేటలో ప్రజాపాలన లో రాయితీ గ్యాస్ సిలిండర్ కోసం 1199 మంది దరఖాస్తు చేసుకున్నారు.ఇందులో సరైన సమాచారం లేని 484 దరఖాస్తులను శనివారం ఈఓ హరిక్రిష్ణ నేతృత్వం నాలుగు బృందాలుగా దరఖాస్తులు పరిశీలన ప్రారంభించారు. మొదటి రోజు 204 దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించి నట్లు ఈఓ తెలిపారు. అయితే పంచాయితీలో 3316 మంది గ్యాస్ వినియోగ లబ్దిదారులు ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది.
ఈ సందర్భంగా ఈఓ హరిక్రిష్ణ మాట్లాడుతూ.. దరఖాస్తులో వినియోగంలో ఉన్న కంపెనీ కాకుండా వేరే గ్యాస్ కంపెనీ పేరు పొరపాటు రాయడం, వినియోగదారు నెంబరు కు బదులు సీరియల్ నెంబరు వేయడంతో సివిల్ సప్లై శాఖ నివేదికలో కనపడలేదు అని అన్నారు. ఆ పొరపాట్లు సరిచేసి తిరిగి యాప్ లో అప్లోడ్ చేస్తున్నామని తెలిపారు.