– దాడులను అరికట్టాలి : జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డెపల్లి రాంచందర్‌కు డీబీఎఫ్ విన్నపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో దళితులపై నిరంతరం జరుగుతున్న దాడులను ఆరికట్టెందుకు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేసె విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రంకు డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాదులో జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టం అమలు పై నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గోన్న కమిషన్ సభ్యులు రామచంద్రంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యం దళితులపై దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. వాటిని నివారిం చటంలో, నిందితులపై చర్యలు తీసుకొవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం ఎఫ్‌ఐఅర్ నమోదయిన ఏడు రోజుల్లో బాధితులకు అందాల్సిన తక్షణ సహయం అందించడం లేదనీ, మొదటి విడత నష్టపరిహారం కొసమే సంవత్సరంకు పైగా ఎదురుచూడాల్సివస్తున్నదని తెలిపారు. చట్టం ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయాల్సిన హైపవర్ కమిటిని ఏర్పాటు చేసి, ప్రతి ఆరు నెల్లకొసారి సమీక్ష చెసి, దళితులపై దాడులను ఆరికట్టాలని డిమాండ్ చేశారు.