ఎస్సీ,ఎస్టీ కమ్యూనిటీ హాల్ భూమీ పూజ చేసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని కంఠాలీ గ్రామములో, తాండా ఎస్సీ , ఎస్టీ భవన నిర్మాణం కోరకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ శుక్రవారం నాడు ప్రారంబించారు. అనంతరం కంఠాలీ తాండా లోని సేవాలాల్ మందిరాన్ని దర్శించుకుని గిరిజన నాయకులతో మాట్లాడారు. కంఠాలీ గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ సీనీయర్ నాయకుడు ఇటివలే మృతి చెందడంతో వారి కుటుంబ సబ్యులకు పరమార్శించారు. కార్యకర్త కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుందని పేర్కోన్నారు. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం అయితే అందరికి సమాన గౌరవం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలోమండల కాంగ్రేస్ పార్టీ నాయకులు, గ్రామపార్టీ నాయకుడు అరుణ్ పటేల్ తదితరులు పాల్గోన్నారు.