మెబైల్ ఫోన్ల దొంగను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై

నవతెలంగాణ – జుక్కల్: మెబైల్ ఫోన్ల దొంగను జుక్కల్ ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలోని సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానిక చెందిన నాగ్ గొండ తనకు సంభందించిన ఓపో ఫోన్ ను మార్చి 3వ తేదిన గ్రామములో పొగొట్టుకోవడం జర్గింది. ఇట్టి విషయాన్ని జుక్కల్ పీఎస్ లో ఫీర్యాదు చేయడం జర్గింది. వెంటనే స్పందించిన పోలీసు అధికారి సిబ్బందితో కలిసి డాటా ఎంట్రి సీఈఐఆర్ ద్వారా ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేసారు. ఫోన్ ఉన్న వ్యక్తినుండి మేాబైల్ ను రికవరి చేసి పోగోట్టుకున్న వ్యక్తి నాగ్ గొండకు మార్చీ 11 వ తేదిన అందించడం జర్గిందని ఎస్సై సత్యనారాయణ పేర్కోన్నారు.