నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయం ఎన్నికల విభాగం డిప్యూటి తహశీల్దార్ గా ఎస్.డీ హుస్సేన్ నియమించబడ్డారు. ఆయన శుక్రవారం తహసీల్దార్ క్రిష్ణ ప్రసాద్ కు జాయినింగ్ రిపోర్ట్ చేసారు.ఖమ్మం జిల్లా లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న హుస్సేన్ పదోన్నతి పై భద్రాద్రి కొత్తగూడెం కేటాయించబడ్డారు. సత్తుపల్లి కి చెందిన ఈయన అశ్వారావుపేట కోరుకోవడంతో ఉన్నతాధికారులు ఇక్కడకు బదిలీ చేసారు.