ధర్మారం గురుకుల విద్యార్ధులకు ఐఐటి లో సీటు ..

Seat in IIT for Dharmaram Gurukula students..నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ  ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్న ధర్మారం లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ ప్రతిభ కళాశాల లో ఇటివల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు  ఐఐటి యన్ ఐ టి , ఐఐఐ టి , సి యాఫ్ టి ఐ లో సీట్లు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి సంగీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు .ఇటీవల ప్రకటించిన సీట్ల కేటాయింపు లో  పి అభినయ ఐఐటి (బి యాచ్ యు )వారణాసి లో   బి టెక్ ఫార్మ సిటికల్ ఇంజనీరింగ్ లో , బి వర్ష  యునివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో  ఇంటిగ్రేటెడ్ ఎం టెక్ (కంప్యూటర్ సైన్సు) ,  యన్  కృతజ్ఞ కు ఐఐఐ టి దర్వాడ్ లో  డేటా సైన్సు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ లో సీట్లు సాధించారని ఇంకో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు మిగిలి ఉందని సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సీట్లు సాధించిన విద్యార్ధులను తల్లి దండ్రులను రీజినల్ కోఆర్డినేటర్ అలివేలు, కళాశాల ప్రిన్సిపాల్ సంగీత  అధ్యాపక బృందం అభినందించారు.