
చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాల్గవ తరగతి విద్యార్థినులు గునుగంటి చందు సహస్ర,బత్తుల అశ్విని,ఊదరి అక్షయ లకు ఐదవ తరగతి గురుకుల పరీక్షలో సీట్లు సాధించారు. భర్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు జాలిగామా నాగరాజు ఫౌండేషన్ సభ్యులు టంగుటూరి కిరణ్,యముడాల సాయి క్రిష్ణ మంగళవారం సత్కరించి మిఠాయిలు పంచిపెట్టారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు జాలిగామా నాగరాజు మాట్లాడుతూ.. గురుకులంలో విద్యార్థినులకు సీట్ రావడానికి కృషి చేసిన ప్రధానో ఉపాధ్యాయురాలు విజయ కుమారి ఉపాద్యా యులు ప్రవీణ్ కుమార్ లను అభినందించారు. విద్యార్థులని ప్రోత్సహించడంలో భర్తీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు సామిడి భుచ్చిరెడ్డి,బాల్ రెడ్డి,బోనకుర్తి శ్రీనివాస్,గునిగంటి శంకర్,చెన్నోజు రాఘవేంద్ర,ఊదరి సోమయ్య, యాదయ్య,చెరుకు శ్రీరామ్,సామిడి నరేందర్ రెడ్డి, చెరుకు శ్రీశైలం,దాసరి శివ కుమార్,గుడ్డేటి దినేష్, ఊదరి జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.