పీఎస్ఎస్ఎమ్ నవనాథపురం రెండవ వార్షికోత్సవ కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్ 
నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం  పట్టణ కేంద్రంలోని నవనాథ సిద్దలగుట్టపై నిర్వహించిన పిఎస్ఎస్ఎం నవనాథపురం రెండో వార్షికోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పత్రీజీ ధ్యాన గ్రామీణ 108 రోజులు, 108 గ్రామాల విజయోత్సవ సంబరాల్లో ధ్యాన బంధువులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ రోజుల్లో మానసిక ఒత్తిళ్ళను తట్టుకోవడానికి మనిషికి ధ్యానం అనేది ముఖ్యమని సూచించారు. ప్రతి మనిషి పని ఒత్తిళ్లతో సతమవుతున్న ఈ రోజుల్లో అందరూ ఒకే చోట కూర్చొని ధ్యానం చేయడానికి ధ్యాన బంధువులు నిర్మించుకున్న ఈ ధ్యాన మందిరం వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనకు స్వర్గీయ పరమపూజ సుభాష్ పత్రీజీ తో తనకున్న సాన్నిహిత్యాన్ని, సత్సబంధాలను ధ్యాన బంధువులతో గుర్తు చేసుకున్నారు. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ గారి మారదర్శకంలో ప్రతి ఒక్కరు నడవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ధ్యాన మందిర నిర్వాహకుల కోరిక మేరకు నియోజకవర్గ నిధుల నుండి పది లక్షల రూపాయలను ధ్యాన మందిరం అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు ఈ వేడుకల్లో హాజరైన నవనాథ సిద్దుల గుట్ట ఆలయ కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ సభ్యులు సత్కరించారు. అనంతరం ధ్యాన మందిరం ఎదురుగా ఒకవైపు మహాశివుని విగ్రహం, మరోవైపు పితామహా సుభాష్ పత్రీజీ విగ్రహ ఏర్పాట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ జ్ఞాన దాత దామోదర మహాస్వామి, జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణ రెడ్డి ట్రస్ట్ సభ్యులు గంగారెడ్డి, , శ్రావ్య గార్డెన్స్ గంగారెడ్డి, శ్రీనివాస్,  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి బాబా గౌడ్, సిద్ధుల గుట్ట కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, జిమ్మీ రవి, ప్రశాంత్ గౌడ్, బీడీ శ్రీనివాస్, చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.