రెండో దఫా పంట ఋణం మాఫీ

Second crop loan waiver– నియోజక వర్గంలో పంట ఋణం లబ్ధిదారులు 11608 మంది…

– లక్ష లోపు 7366,1 లక్ష 50 వేలు లోపు 4242 లబ్ధిదారులు….
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ ఆద్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట ఋణ మాఫీ పధకంలో మంగళవారం రూ. 1 లక్షా 50 వేలు లోపు ఉన్న పంట ఋణం ఉన్న రైతులకు ఋణ విముక్తి కలిగించింది.తొలి మలి విడతలు తో మొత్తం నియోజక వర్గంలో 11608 మందికి పంట ఋణం మాఫీ లబ్ధిదారులు గా ప్రకటించింది. మొదటి విడతగా రూ.1 లక్ష లోపు 7366 మందిని,రెండో విడతగా రూ.1 లక్ష నుండి 1 లక్షా 50 వేలు పంట ఋణం ఉన్నవారికి మాఫీ చేసింది.
మండలం              తొలి            మలి        మొత్తం
అశ్వారావుపేట       1781            1082       2863
దమ్మపేట             2055              954        3009
ములకలపల్లి         1642             1052     2694
అన్నపు రెడ్డి పల్లి      764                 458      1222
చండ్రుగొండ         1124              696        1820
మొత్తం               7366             4242    11608