మార్కెట్లకు రెండో రోజూ నష్టాలు..

మార్కెట్లకు రెండో రోజూ నష్టాలు..ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలు చవి చూశాయి. సూచీలు గరిష్ఠానికి చేరుకోగా మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బుధవారం సెషన్‌లోనూ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 536 పాయింట్ల పతనంతో 71,357కు తగ్గింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 21,517 వద్ద ముగిసింది. దాదాపు 1,917 షేర్లు రాణించగా.. 1,390 షేర్లు నష్టాలు చవి చూడగా.. మరో 79 స్టాక్స్‌ యథాతథంగా నమోదయ్యాయి.