స్థానిక కలెక్టర్ మైదానంలో జరుగుతున్న డిఎస్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ రెండవ రోజు మంగళవారం కొనసాగాయి. పోటీలకు సంబంధించిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాలీబాల్ జూనియర్ కాలేజీ గర్ల్స్ విభాగంలో మొదటి స్థానం ఎం.జె.పి.టి. బిఎస్. గర్ల్స్ కాలేజీ, దాన్నగర్, రెండవ స్థానంలో టిఎస్ డబ్ల్యుఆర్ఎస్ గర్ల్స్ జూనియర్ కళాశాల, సుద్దపల్లి, వాలీబాల్ హైస్కూల్ విభాగంలో బాలికల ప్రథమ స్థానం జడ్పీహెచ్ఎస్ మగ్గిడి, రెండవ స్థానం పిఎంఆస్ఐబిఎస్ బాల్కొండలు నిలిచాయి. ఖోఖో జూనియర్ కళాశాల బాలుర విభాగంలో మొదటిస్థానం టిజిఆర్ఎస్ జూనియర్ కళాశాల పోచంపాడ్, రెండవ స్థానంలో టిజిఎంఆర్ఎస్ జూనియర్ కళాశాల నిజామాబాద్-3 (చందూర్)లు గెలిచాయి.వాలీబాల్ విజేతలకు రేపు మధ్యాహ్నం గౌ॥ మాజీ మంత్రివర్యులు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేయటం జరుగుతుంది. ఇంకా మిగిలిన ఖోఖో పోటీలతో పాటు కబడ్డీ పోటీలు ప్రారంభమవుతాయి అని డిఎస్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలియజేశారు.