
మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ సమ్మె సిఐటియు ఆధ్వర్యంలో రెండో రోజుకు మంగళవారం చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి మధ్యాహ్న బోజన కార్మికుల జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్ మాట్లాడుతూ ఏడు నెలల నుండి మధ్యాహ్నం భోజన కార్మికుల బిల్లులు రాకపోవడంతో కార్మికులు ఆందోళనకు లోనై నానా అవస్థలు పడుతూ పేద పిల్లలైనటువంటి ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న విద్యార్థులకు అన్నం పెట్టలేక తాను తినలేక ఆందోళనకు గురి అవుతున్నారు. కావున సిఐటి యు ఆధ్వర్యంలో ఈ నెల 10, 11, 12, తేదీలలో సమ్మె జరుగుతున్న విషయం విధితమే. కాగా 12వ తేదీన కలెక్టర్ ముట్టడి ఉన్నందున తమ సమస్యలు పరిష్కారం కొరకు అందరు రావాలని మన సమస్యలు కేసీఆర్ 2022 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా ఒక వెయ్యి ఉన్నదాన్ని రెండు వేలకు పెంచుతూ రూ. 3000 వేతనం ఇస్తానని వాగ్దానం చేశరు. ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. స్లాబరేటు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచలేదనీ, బకాయిలు చెల్లించలేదనీ, మరి ఏజెన్సీలు కార్మికులు బ్రతకడం కష్టంగా ఉందని, సమస్యల పరిష్కారం కొరకు రేపు కలెక్టరేట్ ముట్టడి అందరు రావాల్సిందిగా కలెక్టర్ ను నిలదీయవలసిందిగా ప్రభుత్వాన్ని సిఐటియు మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ కోరుచున్నదన్నారు. అందరు సకాలంలో రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాలావత్ తుకారం పాల్గొన్నారు.