మంచి నీటి సహాయకులకు రెండో రోజు శిక్షణ..

Second day of training for good water helpers.నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామీణ మంచి నీటి సహాయకులకు 4రోజుల శిక్షణ లో బాగంగా రేండవ రోజు మిషన్ భగీరథ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ బుధవారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలోని రైతు వేదికలో ఎఈఈ డిప్ చంద్ శిక్షణను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉన్న గ్రామీణ మంచి నీటి సహాయకులు తమ పరిధిలో ఉన్న మోటార్ల రీపేరింగ్, వైర్లు, మేటిరియల్ ఏరకంగా వాడాలి నిరంతరంగా ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు శిక్షణ లో నేర్పిన అంశాల ఆధారంగా ఎలక్ట్రేషన్ లు పొడుచుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న నీటి ట్యాంకుల్లో క్రమం తప్పకుండా క్లోరినేషన్ ఏ మోతాదులో వేయాలో తెలుసుకుని అదే విదంగా చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు అందజేసే నీటీని కలుషితం కాకుండా సమయను సారం నీటి సరఫరా చేస్తునే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడైనా లికేజీలు ఉంటే వేంటనే దాన్ని మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు. నల్గు రోజుల్లో రోజుకు ఒక అంశంపై శిక్షణ అందజేస్తున్నమని ఈ శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  సమావేశంలో ఏఈఈ సాయిచరణ్, ఏ డ్లు ఏఈ శివా ట్రైనర్ ధనుంజయ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.