నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రమణ్యేశ్వర యాగం రెండో రోజుకు చేరుకుంది. గురువారం యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామసుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.. ఉదయం యాగశాలకు చేరుకున్న కేసీఆర్ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. రాష్ట్ర శ్రేయస్సును కాంక్షిస్తూ యజుర్వేద పండితులు ఘనస్వస్తి పలికారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యవేకëణలో సాగుతున్న యాగంలో ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు. సీఎం దంపతులు చేపట్టిన యాగం శుక్రవారం నిర్వహించే పూర్ణాహుతితో ముగియనుంది.. ఉదయం 11.10 గంటలకు పూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయం నిర్ణయించారు. యాగ నిర్వహణలో తెలంగాణతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది పండితులు పాల్గొన్నారు.