– ప్రొ కబడ్డీ లీగ్ 2024
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృoభించడంతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 30 పాయింట్ల తేడాతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 52%-%22 తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. జైపూర్ జట్టులో అర్జున్ తో పాటు అభిజీత్ మాలిక్ (8) కూడా ఆకట్టుకున్నాడు. ఆతిథ్య టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ (7 ), విజరు మాలిక్ ( 5), ఆశీష్ నర్వాల్ (5) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయిన టైటాన్స్ నాలుగుసార్లు ఆలౌటైంది.