
తెలంగాణ రాష్ట్ర ఓపెక్ 4వ కరాటే చాంపియన్ షిప్ 2023లో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కరాటే ప్రదర్శన పోటీలలో పాఠశాలకు చెందిన విద్యార్థినిలు తమ్మనపల్లి రుషిత, లోలపు భవానీలు ఉత్తమ ప్రదర్శన చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. ద్వితీయ స్థానంలో నిలిచిన తమ్మనపల్లి రుషిత, లోలపు భవానీలకు బహుమతిగా కప్ ను, మెడల్స్ ను, ప్రశంస పత్రాలను నిర్వాహకులు అందజేశారు. ఈ మేరకు బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఓపెక్ 4వ కరాటే చాంపియన్ షిప్ 2023లో ఉత్తమ ప్రదర్శన చేసి ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థినిలు తమ్మనపల్లి రుషిత, లోలపు భవానీ లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఎస్ఎంసి చైర్మన్ లోలపు సుమన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు అభినాష్, శివాని, తదితరులు పాల్గొన్నారు.