టైటాన్స్‌కు రెండో విక్టరీ

Second win for the Titans– ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11
నవతెలంగాణ-హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి నుంచి పుంజుకున్న తెలుగు టైటాన్స్‌.. సోమవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన లీగ్‌ దశ మ్యాచ్‌లో మూడు సార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌పై 28-26 తో మెరుపు విజయం సాధించింది. ప్రథమార్థంలో వెనుకంజ వేసిన టైటాన్స్‌.. ద్వితీయార్థంలో దుమ్మురేపే ప్రదర్శన చేసింది. 2 పాయింట్ల తేడాతో సీజన్లలో రెండో విజయం సాధించి.. వరుస పరాజయాలకు చెక్‌ పెట్టింది. తెలుగు టైటాన్స్‌ రెయిడర్లు ఆశీష్‌ నర్వాల్‌ (9 పాయింట్లు), పవన్‌ సెహ్రావత్‌(5 పాయింట్లు), డిఫెండర్‌ అంకిత్‌ (4 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్‌ తరఫున రెయిడర్లు దేవాంక్‌(7 పాయింట్లు), అయాన్‌ (6 పాయింట్లు) రాణిం చారు. పట్నా పైరేట్స్‌కు మూడు మ్యాచుల్లో ఇది రెండో ఓటమి కాగా.. తెలుగు టైటాన్స్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో విజయం కావటం విశేషం.