నవతెలంగాణ – రెంజల్
ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి, తప్పులను గ్రామ కార్యదర్శిలు నవీన్, సతీష్ చంద్రలు సరి చేయడంలో నిమగ్నమయ్యారు. విద్యుత్తు సర్వీస్ నెంబర్ తో పాటు, గ్యాస్ ఏజెన్సీల సరి చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలలో తప్పులున్న ప్రతి ఒక్కరికి తమ ఫోన్లలో మెసేజ్లు వస్తాయని మెసేజ్లు వచ్చిన వారు మాత్రమే గ్రామపంచాయతీకి విచ్చేసి తప్పులను సరి చేయించుకోవాలని వారు సూచించారు. వారి వెంట కారోబార్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.