కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి..

The problems of secretaries should be solved.నవతెలంగాణ – బొమ్మలరామరం
గ్రామపంచాయతీలో నిధులు లేకపోవడంతో రోజువారి పనులు నిర్వహించలేకపోతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని గురువారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజా త్రివిక్రమ్ కు మండల కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలో నిధులు లేకపోవడంతో పంచాయతీ సిబ్బందికి జీతాలు లేక, రోజువారి ఖర్చులు,నిర్వహించలేకపోతున్నామని అన్నారు.గ్రామాలలో సర్పంచులు పదవి కాలం ముగిసిపోవడంతో ప్రత్యక్ష అధికారులకు పరిపాలన బాధ్యతలు అప్పగించారు. ప్రత్యక్ష అధికారులు పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పంచాయతీ పాలన నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఖాతాలన్నీ ఖాళీగా ఉండడంతో కేంద్రం,రాష్ట్రం ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో కార్యదర్శులు జేబులో నుంచి పెట్టుబడి పెడుతున్నామని,గత తొమ్మిది నెలల నుండి నిధులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో ఏ ఉద్యోగం కూడా తన జీతం డబ్బులతో తన ఇంటికి తన కుటుంబానికి మాత్రమే ఖర్చుచేసుకుంటారని, గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఒక్క పంచాయతీ కార్యదర్శులు మాత్రం తమ తమ జీతాలు నుండి ఖర్చు చేయవలసి వస్తుందని ఆ విధంగా వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితిని గమనించి తమకు న్యాయం చేసి పై అధికారులకు తెలుపాలని కోరారు.