పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: కార్యదర్శి శ్రీరామ మూర్తి

Environment should be kept clean: Secretary Sri Rama Murthyనవతెలంగాణ – అశ్వారావుపేట
నిత్యం మనం నివసించే పరిసరాలను మనమే కలుషితం చేసుకుని రోగాలను కొనితెచ్చుకోవద్దు అని తద్వారా ఆర్ధిక పరంగా,ఆరోగ్యపరంగా నష్టపోవాల్సి వస్తుందని పంచాయతీ కార్యదర్శి కోటమర్తి శ్రీరామ్మూర్తి సూచించారు.  శుక్రవారం పంచాయతీలో ఫ్రైడే  – డ్రైడే  కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.చిన్నంశెట్టి బజార్,నిమ్మల బజార్, బస్టాండ్ ఏరియా,కోనేటి బజార్లలో పారిశుధ్యం పనులను పరిశీలించారు. ఆశ కార్యకర్తలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నివాస గృహాల మద్య ఉన్న మురికి నీటి గుంతలను పరిశీలించి లార్వా ను నిర్మూలించేందుకు నీటిలో దోమల నివారిణి మందును వేయించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.