నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం పేపర్ మిల్ గ్రామంలో ని ప్రైమరీ పాఠశాల ఆవరణలో ఇన్చార్జి గ్రామ కార్యదర్శి జక్కుల భాస్కర్ మొక్కలు నాటారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చివరి రోజున పాఠశాల ఆవరణలోని కాళీ స్థలాలలో మొక్కలు నాటడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఉపాధి హామీ సిబ్బంది నసీర్, గ్రామపంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.