15వ విడత ప్రజా వేదికలో పొరపాటు చేసిన వారిపై చర్యలు తప్పవు..

– డి ఆర్ డి ఏ పి డి చందర్ నాయక్..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలంలో 15వ విడత ప్రజా వేదికలో పొరపాట్లు చేసిన క్షేత్ర సహాయకుల పై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సాంకేతిక లోపాల వల్ల పొరపాట్లు జరిగాయని వచ్చే ఆడిట్లోపు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని డి ఆర్ డి ఎ పి డి చందర్ నాయక్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం 15వ విడత ప్రజా వేదిక జరిగింది. ఈ ప్రజా వేదికలో ఆయన మాట్లాడుతూ ఒక్క సంవత్సరకాలంలో మండలానికి మూడు కోట్ల 20 లక్షల రూపాయలపై ఆడిట్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ సమస్యలు, మాస్టర్ల లో దిద్దు బాట్లు, చనిపోయిన వారికి హాజరు వేయడం, పని ప్రదేశంలో సిగ్నల్స్ రాక ఇబ్బందులు, పని చేసిన వారికి డబ్బులు రాకపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఎలాంటి పొరపాట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్ర సహాయకులను ఆదేశించారు. కొన్ని గ్రామాలలో మస్టర్లు పేర్లు లేకుండానే పేమెంట్ ఇవ్వడం జరిగిందని హరితహారం లో భాగంగా చనిపోయిన మొక్కలపై రికవరీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జాబ్ కార్డులలో చనిపోయిన వారి పేర్లను తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు. పొరపాట్లు చేసిన క్షేత్ర సహాయకుల కు 20 రోజుల్లో వాటిని గుర్తించి దుర్వినియోగం జరిగిన డబ్బులను రికవరీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజిని కిషోర్, విజిలెన్స్ అధికారి నారాయణ, ఎంపీడీవో శంకర్, ఎస్ఆర్పి అశోక్, ఎస్ టి ఎం అంజా గౌడ్, ఏపీవో రమణ, ఈసీ శరత్చంద్ర, సాంకేతిక సహాయకులు దేవి సింగ్ ,రాజేశ్వర్, గ్రామ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, డిఆర్పీలు, తనిఖీ బృందాలు పాల్గొన్నారు.