
నవతెలంగాణ- డిచ్ పల్లి
ప్రపంచములోనే అతి పెద్ద భారత రాజ్యాంగ మని, ఇందులోని పీఠిక “భారత ప్రజాలమైన మేము” అని మొదలవుతుందని సర్వసత్తాక సోషలిస్టు, సెక్యులర్ ప్రజాస్వామ్య రిపబ్లిక్ అని, దీనిని కాపాడు కోవలకున అవసరం అందరి మీద ఉందని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షలు నార్ర రామారావు అన్నారు. శుక్రవారం డిచ్ పల్లి మండలంలోని శుక్రవారం ధర్మారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నుద్దేశించి అయన మాట్లాడారు. మనుధర్మం కన్న మానవ ధర్మాన్ని తెలిపేదే రాజాంగం గొప్పదని, మత రాజ్యలు గా ఉన్న పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్ లు అ ధోగతి పాలయ్యాయని, మన దేశాన్ని కూడ మత రాజ్యంగా మార్చాలని కుట్ర జరుగుతుందని వివరించారు. దీనిని తిప్పి కొట్టాలని సూచించారు. దీంతోపాటు శాస్త్రీయ దృక్పథము 51 (1) h ప్రకారం అలవర్చు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బర్దిపూర్ సహకార సొసైటీ చైర్మన్ కొసరాజు రామకృష్ణ, తలారి సామన్న, కన్వీనర్ మండల జన విజ్ఞాన వేదిక, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు సుజాత, అద్యపాకులు, విద్యార్థులు పాల్గొన్నారు.