లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను రక్షించాలి: బొంగోని అభిలాష్

నవతెలంగాణ – శంకరపట్నం
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో జరుగుతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పౌరులు తమ రాజకీయ ఆర్థిక సామాజిక సమానత్వం స్వేచ్ఛ సౌబ్రాతృత్వం కొనసాగించాలని జాతీయ బీసీ సంఘం మండల అధ్యక్షుడు బొంగోని అభిలాష్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా గురువారం శంకరపట్నం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో అభిలాష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులు మతసామరస్యాన్ని కాపాడే పార్టీలకే మద్దతు ఇవ్వాలని 60 శాతం ధనం కేవలం 10 శాతంగా ఉన్న ధనవంతుల దగ్గరే ఉందని మిగిలిన 50% పేద ప్రజల దగ్గర కేవలం 6% సంపద మాత్రమే ఉందని దేశ భవిష్యత్ రీత్యా రాష్ట్ర విభజన హామీల రీత్యా సామరస్య హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రజాస్వామ్య సదస్సు ఈనెల 11 న హుజూరాబాద్ లోని సిటీ సెంటర్ హాల్లో జరిగే ఈ సమావేశానికి ప్రజలు హాజరుకావాలని భేటీ బచావో నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, సదానందం భీమోజు , పొడిశేట్టి వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.