నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా కొనసాగు తున్నాయి. దాదాపు రూ.720 కోట్ల వ్యయంతో 36 నెలల్లో పూర్తి చేయడానికి మెసర్స్ గిర్ధారిలాల్ కన్‌స్ట్రక్షన్ ప్రయివేట్ లిమిటెడ్‌కు ఈపీసీ విధానంలో నిర్మించేందుకు పనులు కేటాయించబడిన సంగతి తెలిసిందే. తదనుగుణంగా నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ప్రస్తుత స్టేషన్ భవనానికి రెండు వైపులా పనులు ప్రారంభించారు. నిర్మాణ కార్యకలాపాలను సులభతరం చేయడానికి తాత్కాలిక బుకింగ్ కార్యాలయం నిర్మించారు. అదే విధంగా కొత్త ఆర్పీఎఫ్ భవనం పనులు పూర్తి చేశారు. బేస్‌మెంట్ 1 స్లాబ్ పనులు 80 శాతం, బేస్‌మెంట్ 2 స్లాబ్ పనులు 60 శాతం పూర్తయ్యాయి. దాదాపు 200 కార్లు బేస్‌మెంట్ 2లో పార్కింగ్ చేసుకొనే సామర్థ్యం కలిగి ఉంది.