6న సికింద్రాబాద్‌-వాస్కోడాగామా ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడాగామాకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆదివారం కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి జెండావూపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని దక్షిణ మధ్య రైల్వే శుక్రవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌ నుంచి కర్నాటక, గోవా వైపు ప్రయాణించేవారికి ఈ రైలు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. వారానికి రెండ్రోజులు నడిచే ఈ రైలు 854 కిలోమీటర్ల దూరాన్ని 20 గంటల్లో చేరుకుంటుంది. సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూల్‌ సిటీల మీదుగా వాస్కోడాగామాకు వెళ్తుంది.