వీడీ బ్లాక్‌హాక్స్‌ ఓపెన్‌!

– 10, 11న వాలీబాల్‌ ఫైనల్స్‌
హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ నిర్వహిస్తున్న వీడీ బ్లాక్‌హాక్స్‌ ఓపెన్‌ 2024 తుది అంకానికి చేరుకుంది. ఈ నెల 10, 11న గచ్చిబౌలి స్టేడియంలో తుది పోటీలు నిర్వహించనున్నారు. ఆదిలాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, నల్లగొండ, కరీంనగర్‌, వరంగల్‌, గుంటూర్‌, విజయవాడ, నెల్లూరు, కడప, రాజమండ్రి, కర్నూల్‌, విశాఖపట్నం, ఏలూరు జట్లు జిల్లా స్థాయి పోటీల్లో తలపడ్డాయి. విజేతలకు రూ. 2 లక్షల నగదు బహుమానం ఇవ్వనున్నట్టు బ్లాక్‌హాక్స్‌ యాజమానులు అభిషేక్‌ రెడ్డి, విజరు దేవరకొండ తెలిపారు.