అభివృద్ధిని చూసి మరోసారి గెలిపించాలి

– ప్రచారంల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు
నవతెలంగాణ-గండిపేట్‌
అభివృద్ధిని చూసి కారును మరోసారి గెలిపించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. మంగళవారం బండ్లగూడ, నార్సింగి మున్సిపాలిటీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. ప్రజా సంక్షేమానికి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. నాలుగో సారి రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేగా ప్రకాష్‌గౌడ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్‌ మహేందర్‌ గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ రాజేందర్‌రెడ్డి, వైస్‌ ఛైర్మెన్‌ వెంకటేష్‌యాదవ్‌, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్‌, కార్పొరేటర్లు సంతోషిరాజీరెడ్డి, రవీందర్‌రెడ్డి, సాగర్‌ గౌడ్‌, తలారి చంద్రశేఖర్‌, కౌన్సిలర్లు పత్తి శ్రీకాంత్‌రావ్‌, ప్రవీణ్‌కుమార్‌, కో-ఆప్షన్‌ సభ్యులు మాలకీరత్నం, జగదీష్‌, మహిముద్‌ ఆలీ, డైరెక్టర్లు సాయిబాబ, లక్ష్మీబారు, రాజు, రాజుకుమార్‌, నాయకులు జితేందర్‌, ఫారుక్‌, రాజేష్‌యాదవ్‌, రమేష్‌యాదవ్‌, మల్లేష్‌యాదవ్‌, మహిళలు ప్రియాదర్శినీ, జయమ్మ, అరుణ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.