”తండేల్’ పాటలన్నీ చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. పాటలకి వస్తున్న రెస్పాన్స్‌కి హ్యాపీ. చాలా రోజుల తర్వాత వస్తున్న లవ్ స్ట్టోరీ ఇది. ‘బుజ్జితల్లి’.. పాట రిలీజైన వెంటనే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ పాట విని ‘నీ ఆల్ టైమ్ టాప్ ఫైవ్‌లో ఉంటుంద’ని చెప్పారు. అలాగే శివుని పాట, హైలెస్సో పాటలు గొప్పగా జనాల్లోకి వెళ్ళాయి. ఆడియన్స్ సాంగ్స్‌ని చాలా బాగా ఎంజారు చేస్తున్నారు’ అని సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. లవ్ స్టొరీ అనగానే నా పేరే వినిపించడం చాలా హ్యాపీగా ఉంది. ‘నువ్వు వస్తావంటే నేనొద్దంటానా?, వర్షం, ఆర్య, 100% లవ్’తో పాటు ‘శంకర్ దాదా, మాస్’ లాంటి కమర్షియల్ సినిమాలకు కూడా అంతే అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఎలాంటి సినిమా అయినా చేయగలననే పేరు రావడం, అందులో లవ్ స్టోరీస్‌కి నేనైతే బావుంటానని అందరూ భావించడం గాడ్ బ్లెస్సింగ్‌గా భావిస్తాను. ప్రేమ కథలు ఎవర్ గ్రీన్. అందరూ రిలేట్ చేసు కునేలా ఉంటాయి. ప్రేమ పాటలు ఎక్కువ కాలం నిలబడతాయి. నాకు కంప్లీట్ రస్టిక్ ఫోక్ స్టోరీ ఉన్న సినిమా చేయలనే ఉండేది. ఆ కోరిక ‘రంగస్థలం’తో తీరింది. అందులో పాటలన్నీ జానపద మూలల్లో నుంచి చేసినట్లుగా ఉంటుంది. మళ్ళీ అలాంటి ఫోక్ టచ్ ఉన్న సినిమా ‘ఉప్పెన’. అయితే అందులో కంపోజిషన్ కాస్త సూఫీ స్టయిల్, క్లాస్ మిక్స్ చేసినట్లుగా ఉంటుంది. ‘తండేల్’ కూడా అంతే. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. పాకిస్తాన్ సరిహద్దులలో చిక్కుకున్న మన మత్య్సకారుల కథ. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న కథ. ఇప్పటికే మూడు పాటలు విన్నారు. రాబోయే పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. నేపథ్య సంగీతం కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. డైరెక్టర్ చందూ గ్రేట్ విజన్‌తో సినిమా తీశాడు. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. చైతు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్, పెర్ఫార్మెన్స్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఎమోషన్స్ చాలా అద్భుతంగా పండించారు. ఇందులో కొత్త నాగచైతన్యని చూడబోతున్నారు (నవ్వుతూ). సాయి పల్లవి అద్భుతమైన నటి. ఇందులో కూడా ఆమె పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. చై, సాయిపల్లవి కెమిస్ట్రీ అదిరిపోయింది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఓ సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది బిగ్ స్క్రీన్ పైన చూడాల్సిందే. ఇందులో చాలా మంచి యాక్షన్, బోట్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. బన్నీ వాసు, అరవింద్ చాలా గ్రాండ్‌గా సినిమా తీశారు. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది.