
తెలంగాణ ప్రభుత్వం పది ఎండ్లలలో అన్ని రంగాల్లో అభివృద్ది చేసింది ఆ అభివృద్ది చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని బి అర్ ఎస్ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి కోరారు. వీర్నపల్లి మండల కేంద్రం తోపాటు కంచర్ల గ్రామంలో ఇంటింటికీ తిరుగుతు బి అర్ ఎస్ పార్టి మండల నాయకులు ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ కు ఓటు వేస్తే బిజేపి కి ఓటు వేసినట్లే నని బి అర్ ఎస్ పార్టి బలపరచిన ఎంపి అభ్యర్ధి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడుగా బోయినిపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కటుకురి రాజు, యూత్ మండల అధ్యక్షులు దేవ రాజు, మండల సీనియర్ నాయకులు గోగురి రమేష్, లింబద్రి నాయకులు రాజు,మహేందర్, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.