విత్తన డీలర్ల అవగాహన సదస్సు..

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యురు వ్యవసాయ అధికారి కార్యాలయంలో బుధవారం మండలంలోని విత్తన,ఎరువుల డీలర్లకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించినట్లుగా మండల వ్యవసాయ అధికారి అత్తె సుధాకర్ తెలిపారు.ఈ సందర్భంగా ఏవో మాట్లాడారు వానకాల సీజన్ ప్రారంభమవుతున్న ప్రస్తుత తరుణంలో మండలంలోని విత్తన దుకాణాలు నిర్వహిస్తున్న ప్రతి డీలరు జాగ్రత్తగా ఉండాలని, నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని సూచించారు.ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ రేట్లకు అమ్మిన, ప్రభుత్వం నిబంధనలు పాటించకపోయినా  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాల విత్తన డీలర్లు పాల్గొన్నారు.