విత్తనాలు,ఎరువులు టర్ఫలెన్లు అందుబాటులో ఉంచాలి..

– జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్..
నవతెలంగాణ-డిచ్ పల్లి
విత్తనాలు,ఎరువులు టర్ఫలెన్లు రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చూడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ తిరుమల ప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని నడ్పల్లి రైతు వేదికలో అగ్రో రైతు సేవ కేంద్రాల డిలర్లకు సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ తిరుమల ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 21అగ్రో రైతు సేవా కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు. పరిశ్రమల అభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేసి ఎరువులు విత్తనాలు తెలంగాణ సిరి ఎరువు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. అగురు డీలర్ రైతులకు అందుబాటులో ఉండి ఉపయోగపడే విధంగా చూడాలన్నారు. ఈ సదస్సులో ఆగ్రోస్ రీజినల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, సూపర్వైజర్ అనసూయ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సల్మాన్, కార్య నిర్వహణ అధికారి రాజు, నిజామాబాద్ డివిజన్ ఏడిఏ ప్రదీప్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, ఏఈఓ భావన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.