విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ దుకాణంలో తనిఖీలు..

charset=InvalidCharsetId

– తాళం వేసిన గోదాం యజమానికి నోటీసు జారీ
నవతెలంగాణ – రాయికల్
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా పై రైతుల అభిప్రాయ సేకరణ సమావేశానికి హాజరైన జిల్లా వ్యవసాయ అధికారిని బి.వాణి  భోజన విరామ సమయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాం లోని స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. అనంతరం పట్టణంలోని కె.రవికుమార్ విత్తనాలు, ఎరువులు,పెస్టిసైడ్స్ దుకాణాన్ని సందర్శించి దుకాణ లైసెన్స్, విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేసి, సంబంధిత దుకాణదారుని గోదాములను తనిఖీ చేయగా దుకాణ యజమాని అందుబాటులో లేని కారణంగా, తనతోపాటు  గోదాంకు వేసిన తాళం చెవి తీసుకువెళ్లాడని కుటుంబ సభ్యులు తెలపడంతో, తదుపరి తనిఖీలు చేపడతామని గోదాం ఇంటి నెంబర్, స్టాక్ రిజిస్టర్లు, గోదాంకు తాళం వేయడం పై నోటీస్ జారీ చేశారు. లైసెన్స్ కలిగిన యజమాని కాకుండా కుటుంబ సభ్యులు ఎవరైనా సంబంధిత ఎరువులు, పెస్టిసైడ్స్, విత్తనాలు అమ్మకాలు చేయవచ్చా అని నవతెలంగాణ జిల్లా వ్యవసాయ అధికారిని వివరణ కోరగా…ఈ-పాస్ మిషన్ లేకుండా పెస్టిసైడ్స్, ఎరువులు అమ్మకాలు చేయరాదని మాట దాటివేశారు. స్టాక్ రిజిస్టర్ లో తప్పనిసరిగా సంబంధిత వివరాలు నమోదు చేయాలని, రైతులు కొనుగోలు చేసిన వాటికి బిల్లు రసీదు ఇవ్వాలని,త్వరలో మండలంలోని అన్ని విత్తనాలు,ఎరువులు, పెస్టిసైడ్స్  దుకాణాల్లో తనిఖీలు చేస్తామని ఏలాంటి అవకతవకలకు పాల్పడ్డ తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తనీఖీలో మండల వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్,ఏ.ఈ.వో మత్తయ్య పాల్గొన్నారు.