నవతెలంగాణ – మోర్తాడ్
రైతులు వార్షకాలం సీజన్లో నాటే విత్తనాలను లైసెన్స్ డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేయాలని సోమవారం రైతులకు ఏవో లావణ్య, ఏ ఈ ఓ లు రైతులకు అవగాహన కల్పించారు. మండలం పాలెం తిమ్మాపూర్ దొనకల్ వడ్డీ యార్డ్ గ్రామాలలో రైతులతో మాట్లాడుతూ లైసెన్స్ డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని లైసెన్స్ లేని ప్రభుత్వానికి లేకుండా విత్తనాలు విక్రయాలు జరిపే వద్ద కొనుగోలు చేయకూడదు అంటూ సూచించారు. రైతులు తప్పనిసరిగా రసీదు తో విత్తనాలను కొనుగోలు చేయాలని, రైతులు కొనుగోలు చేసిన విత్తన బ్యాగులను పంట పూర్తి అయ్యేవరకు భద్రపరుచుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ శాఖ అధికారిని ఏవో లావణ్య మండల కేంద్రంలోని సీడ్స్ వ్యాపారస్తుల షాపులను తనిఖీ చేస్తూ ప్రభుత్వం అనుమతి పొందిన విత్తనాలు మాత్రమే విక్రయాలు జరపాలని అనుమతి లేకుండా విత్తనాలుజరిపితే సంబంధిత షాప్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.