
లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని మండలం లోని వ్యవసాయ విస్తరణ అధికారులు శుక్రవారం తుంగతుర్తి, యర్ర కుంట తండా, పెద్దవూర, లింగంపల్లి పోలేపల్లి, గర్నెకుంట గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ.. ఖరీఫ్ లో వరి, పత్తి, కందులు ఇతర పంటలు సాగు చేయుటకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నాని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు విత్తన సంచి మీద కంపెనీ పేరు, విత్తనరకం, బ్యాచ్ నెంబర్,లాట్ నెంబర్, రేటు ఉన్నదో పరిశీలించాలన్నారు. విత్తనం కొనుగోలు చేశాక రైతు తప్పకుండా బిల్ రశీదు తీసుకొని, అది పంట కాలం అయిపోయే వరకు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు.గ్రామంలో లూజు విత్తనాలు,తక్కువ, ఎక్కువ ధరలకు విత్తనాలు అమ్మే వారెవరైనా వస్తే రైతులు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ అధికారులు రాము, ఆంజనేయులు, మధుకర్, సీతార, రైతులు పాల్గొన్నారు.