ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు అమ్మాలి..

– రసీదు ఇవ్వాలి: మండల టాస్క్ ఫోర్స్ టీం 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

జక్రాన్ పల్లి  మండలంలోని ఎమ్మార్వో,  ఎస్సై, వ్యవసాయ అధికారిని  జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని  పలు  విత్తన కంపెనీలలో  తనిఖీ చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి దేవిక తెలిపారు. దీనిలో భాగంగా స్టాక్ రిజిస్టర్స్, ప్రాసెసింగ్ రిజిస్టర్స్,    ఇన్వాయిస్  మరియు విత్తన  నిల్వలను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు.నకిలీ విత్తనాలు  అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ,  ఎమ్మార్పీ ధరకు విక్రయించాలని మరియు రైతులకు విత్తనాలకు సంబంధించిన రసీదును ఇవ్వాలని  సూచించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కిరణ్మయి మండల వ్యవసాయ అధికారి దేవిక, ఎస్సై తిరుపతి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.