సిరిసిల్ల వెతలు

కొత్త ఏడాది ప్రారంభంలోనే సిరిసిల్ల నేతన్నల బతుకులు కష్టాలపాలయ్యాయి. విద్యుత్‌ చార్జీల భారం మోయలేక, పెరిగిన ముడి సరుకుల ధరలకు అనుగుణంగా మార్కెట్‌ ధర రాక కొన్నేండ్లుగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. అమ్ముడు పోని కోటి మీటర్ల బట్ట యాజమాన్యాన్ని నిండా ముంచేసింది. చేసేది లేక వ్యాపా రులు రెండు వారాల కిందట టెక్స్‌టైల్‌ పార్క్‌లోని పరిశ్రమ లను మూసివేశారు. ఫలితంగా దానిపై ఆధారపడ్డ ఇరవై వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పూట గడవడవమే కష్టంగా మారి కన్నీటితో కడుపు నిం పుకుంటున్నారు. వాస్తవానికి నేతన్నలకు మా ప్రభుత్వం భరోసా అని నిత్యం చెప్పుకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ఈ పతనానికి పునాది పడింది.
సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో 2002 లో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లో నేతన్నలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడు తుండే వారు. వారి జీవితాలు మెరుగు పరచాలని చేనేత కార్మిక సంఘాలు ఎన్నో పోరాటాలు చేశాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం చొరవతో 60 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఏర్పాటు జరిగింది. సుమారు రూ.7.76 కోట్ల అంచ నాతో ఈ పార్క్‌ నిర్మించారు. ఇది మన రాష్ట్రంలోనే మొట్టమొదటి టెక్స్‌టైల్‌ పార్క్‌గా అప్పట్లో అవతరిం చింది. నేత వృత్తి వారికి పార్క్‌లో పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తూ 217 ప్లాట్లను విభజించి కేటా యించారు. స్థాపించిన ఒక్క ఏడాదిలోనే 115 వరకు పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. మొదటి పదేండ్లు వ్యాపారులు లాభాలు బాగానే ఆర్జించారు. ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి.
విద్యుత్‌ చార్జీల భారంతో గతేడాది 40 పరిశ్రమలు మూసివేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే సుమారు 60 వరకు మూతపడ్డాయి. ప్రస్తుతం 32 యూనిట్లు మాత్ర మే కొనసాగుతుండగా ఈ జనవరి మొదటి వారంలో వీటిని కూడా వ్యాపారులు మూసి వేశారు. దీనికి ప్రధాన కారణం విద్యుత్‌ భారమే. యూనిట్‌ విద్యుత్‌ ధర రూ. 3.75 పైసలున్నపుడు వ్యాపారం లాభదాయంగానే నడి చింది. ఆరేండ్ల కిందట యూనిట్‌ ధర రూ.8 చేయడంతో వ్యాపారులపై అదనపు భారం పడింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవడంతో నష్టాలపాల య్యారు. అయితే సిరిసిల్లలో బతుకమ్మ చీరల బట్ట ఉత్ప త్తి చేసే ఎస్‌ఎస్‌ఐ, మ్యాక్స్‌ సంఘాల నుండి మాత్రం రూ.4 చార్జీ మాత్రమే వసూలు చేస్తున్నారు. వీరికి యూనిట్‌కి రూ.2 చొప్పున బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. కానీ కష్టాల్లో ఉన్న టెక్స్‌టైల్‌ పార్క్‌ వ్యాపారులకు మాత్రం ఎలాంటి రాయితీ ఇవ్వలేదు.
ఈ వ్యాపారులు ఇప్పుడే కాదు ఆర్ధిక భారాలు భరించలేక గతంలో కూడా పలుమార్లు పరిశ్రమలను మూసివేయాల్సి వచ్చింది. నాలుగేండ్ల కిందట మాజీ మంత్రి కేటీ ఆర్‌ను కలిసి టైక్స్‌ టైల్‌ పార్క్‌ వ్యాపారులు విద్యుత్‌ చార్జీల రాయితీ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. తప్పకుండా ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ ఆయన మాట నిలబెట్టు కోలేదు. రాష్ట్రం ఏర్పడి తర్వాత 2018లో, 2021లో మాత్రమే రియింబర్స్‌మెంట్‌ చేశారు. కానీ 2022 జనవరి నుండి 2023 డిసెంబర్‌ వరకు బకాయిలు ఇవ్వకపోవడంతో వ్యాపారులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నారు. ఆ నష్టా లను భరించలేక రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసిన తమ రాపియర్స్‌ను సగం ధరకే అమ్మేసుకుంటున్నారు. ఇప్పటికే 115 యూనిట్లలో 82 రాపియర్స్‌ను అమ్మేసు కున్నారని అంచన. అంటే వారి పరిస్థితి ఎంతగా దిగ జారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్కో వస్త్ర పరిశ్రమ యూనిట్‌కు రూ.2 లక్షల నుంచి ఆరు లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. విద్యుత్‌ చార్జీలకు తోడు నూలు రేట్లు కూడా పెరిగి వీరిపై భారం మరింత పడింది. ఇక ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీలు కూడా ఆకాశాన్నం టాయి. దాంతో తయారు చేసిన బట్టను ఇతర ప్రాం తాలకు రవాణా చేయడం కష్టమైంది. సప్లై లేట్‌ అవు తుందని ముంబయితో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రైవేట్‌ ఆర్డర్లు కూడా ఆగి పోయాయి. అలాగే గతంలో మీటర్‌ బట్టను మార్కెట్‌లో రూ.18 నుంచి రూ.70 వరకు అమ్ముతుండే వారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధర లేకపోవ డంతో నష్టాలను చవిచూడాల్సి వస్తున్నది. ప్రస్తుతం పార్క్‌లో 1200 మంది కార్మికులు ప్రత్యక్షంగా, రెండు వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమల మూసివే తతో దాదాపు మూడు వేల మంది రోడ్డున పడ్డట్టయ్యింది.
తాము అధికారంలో ఉన్నప్పుడు పట్టిం చుకోను కేటీఆర్‌ ఇప్పుడు నేతన్నలను ఆదుకో వాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ట్విట్‌ చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రేస్‌ ప్రభు త్వం నేతన్నలను వెంటనే ఆదుకుంటామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ హా మీని నిలబెట్టుకోవాలి. యుద్ధప్రాతిపదికన ఆ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. నష్టా లకు ప్రధాన కారణమైన విద్యుత్‌ రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చే యాలి. అలాగే ప్రభుత్వం నుండి వారికి కొత్త ఆర్డర్లు ఇప్పించాలి. అప్పుడే సిరిసిల్ల టెక్స్‌టైల్స్‌ పార్క్‌పై ఆధారపడ్డ కార్మికుల సమస్యలకు కొంతైనా పరిష్కారం దొరుకుతుంది.