1. స్వరోచి, మనోరమ పాత్రలు గల ప్రసిద్ధ ప్రబంధం
ఎ. వసు చరిత్ర బి. ఆముక్తమాల్యద
సి. నల చరిత్రం డి. మను చరిత్ర
2. ‘రామ రాజ భూషణుడు’ రచించిన లక్షణ గ్రంధం?
ఎ. వసు చరిత్ర బి. హరిశ్చంద్రనలోపాఖ్యానం
సి. నరసభూపాలీయం డి. ఛందోదర్పణం
3. ‘రామాభ్యుదయం’ ప్రబంధకర్త?
ఎ. గొబ్బూరినరసరాజు
బి. అయ్యలరాజు రామభద్రుడు
సి. మాదయ్యగారి మల్లన డి. రామరాజభూషణుడు
4. తెనాలి రామకృష్ణ కవి రచన కానిది? ఎ. ప్రభాతీ ప్రద్యుమ్నం
బి. పాండురంగమహత్మ్యం
సి. ఘటికాచల మహత్మ్యం
డి. హరిలీలా విలాపం
5. ‘సంగాత్రి శాలీనుల కథ’ ఏ ప్రబంధంలో ఉంది?
ఎ. ప్రభావతీ ప్రద్యుమ్నం
బి. రాఘవపాండవీయం
సి. శ్రీకాళహస్తిమహత్మ్యం
డి. కళాపూర్ణోదయం
6. ‘స్తుతిమతిమైన ఆంధ్రకవి’ ఎవరు?
ఎ. పింగళి సూరన బి. నంది తిమ్మన
సి. ధూర్జటి డి. పెద్దన
7. ఆంధ్రభోజుడు ‘శ్రీకృష్ణదేవరాయల’ ఆస్థానంలో గల కవి
ఎ. వెన్నలకంటి సూరన బి. పింగళి సూరన
సి. అనంతామాత్యుడు డి. కూచిమంచి తిమ్మన
8. పెద్దన కవితా లక్షణం…?
ఎ. నాటకీయత బి. సూక్తివైచిత్రి
సి. అల్లిక జగిబిగి డి. రసపోషణ
9. శ్రీకాళహస్తీశ్వర శతకంలో కనిపించేది?
ఎ. భక్తి వైరాగ్యం బి. ఆత్మనివేదన
సి. రాజనీంద, లోకరీతి డి. పైవన్నీ
10. ”భక్తకన్నప్ప కథ లేదా తిన్ననివృత్తాంతం” ఎందులోనిది
ఎ. శ్రీకాళహస్తిమహత్మ్యం
బి. కళాపూర్ణోదయం
సి. శ్రీకాళ హస్తీశతకం
డి. పాండురంగమహత్మ్యం
11. శ్లేషకావ్యమునకు ఉదాహరణం…
ఎ. మనుచరిత్ర
బి. వసుచరిత్ర
సి. రాఘవపాండవీయం
డి. హరిశ్చంధ్రనలోపాఖ్యానం
12. ”రాజుల మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబుల్…” అని వాపోయిన కవి?
ఎ. ధూర్జటి బి. తెనాలి రామకృష్ణ సి. రామరాజభూషనుడు డి. పెద్దన
13. తొలి తెలుగు ద్వర్థి కావ్యం ఏది? ఎ. పాండురంగ మహత్మ్యం
బి. కళాపూర్ణోదయం
సి. రామాభ్యుదయం
డి. రాఘవపాండవీయం
14. వసుచరిత్ర కృతిపతి
ఎ. వెంకటపతి బి. శ్రీకృష్ణదేవరాయలు
సి. అళియరామరయలకు డి. ఓబయ నరసరాజుకు
15. ‘రాధామాధవ కవి’ బిరుదాంకితుడైన చింతలపూడి ఎల్లనార్యుడి రచన/రచనలు
ఎ. రాధామాధవము
బి. తారక బ్రహ్మ రాజీయం
సి. విష్ణుమాయ నాటకం డి. పైవన్నీ
16. ఈ క్రింది వానిలో ద్వర్థి కావ్యం?
ఎ. వైజయంతీ విలాసం బి. హరిశ్చంద్రనలోపాఖ్యానం
సి. సిద్దేశ్వరి చరిత్ర
డి. రాధామాధవము
17. ‘కవి కర్ణ రసాయనము’ గ్రంథకర్త?
ఎ. కందుకూరి రుద్రకవి బి. అద్ధంకి గంగాధరకవి
సి. సంకుసాల నృసింహకవి
డి. చదలవాడ మల్లన
18. ‘మను వసు ప్రకాశిక’ విమర్శక గ్రంథం రాసిన వారు?
ఎ. పల్లా దుర్గయ్య
బి. వేటూరి ప్రభాకర శాస్త్రి
సి. కాశీపట్ల బ్రహ్మయ్యశాస్త్రి
డి. నిడదవోలు వెంకటరావు
19. ‘ప్రబంధ వాజ్మయ వికాసము’ గ్రంథకర్త?
ఎ. పల్లా దుర్గయ్య
బి. కడియాల రాంమోహన్‌రారు
సి. వేటూరి ప్రభాకర శాస్త్రి
డి. ఆచార్య టి.కోటేశ్వరావు
20. ‘సంగీత రహస్యకళానిధి’ బిరుదు గల కవి?
ఎ. నంది తిమ్మన
బి. రామరాజ భూషనుడు
సి. తెనాలి రామకృష్ణ కవి
డి. అన్నమయ్య
21. ‘ప్రబంధ లక్షణాలు’….
ఎ. ఏక నాయకాశ్రయత్వము, వాస్తైక్యం
బి. అష్టాదశ వర్ణణాత్మకం, శృంగారరస ప్రధానం
సి. ఆలంకారిక శైలి ప్రబంధానికి జీవం, భాషాంతరీకరణంకారాదు
డి. పైవన్నీ
22. ‘విజయ విలాసం’ అనే ప్రబంధాన్ని రాసిన కవి?
ఎ. నాచన సోమన
బి. రఘునాధ నాయకుడు
సి. చేమకూర వెంకటకవి
డి. విజయ రాఘవుడు
23. ”అల్లసాని వాని అల్లిక జిగిబిగి” అనే విమర్శక గ్రంథం రాసింది?
ఎ. డా.సి.నారాయణరెడ్డి
బి. శ్రీరంగం శ్రీనివాసరావు
సి. గురజాడ అప్పారావు
డి. విశ్వనాథసత్యనారాయణ
24. ‘పారిజాతాపహరణం’ కృతి కర్త ఎవరు?
ఎ. నంది తిమ్మన
బి. భట్టుమూర్తి
సి. రామరాజభూషనుడు
డి. పింగళి సూరన
25. ”క్షేత్రమహాత్మ్య ప్రబంధం”….?
ఎ. కళాపూర్ణోదయం
బి. పాండురంగ మహత్మ్యం
సి. విజయవిలాసం
డి. రాఘవ పాండవీయం
26. ”కేవలం కల్పనా కథలు కృత్రిమ రత్నములు” అని రామరాజ భూషనుడు ఏ ప్రబంధాన్ని దృష్టినందుకొని తన అభిప్రాయాన్ని తెలిపాడు.
ఎ. పాండురంగ మహత్మ్యం
బి. మనుచరిత్ర
సి. రాజశేఖర చరిత్ర
డి. కళాపూర్ణోదయం
27. ‘పెద్దన వలె కృతి చెప్పిన పెద్దన వలె’ అన్నది ఎవరు?
ఎ. తెనాలి రామకృష్ణుడు
బి. విశ్వనాథ సత్యనారాయణ
సి. కవి చౌడప్ప
డి. వేటూరి ప్రభాకరశాస్త్రి
28. ఆధునిక ‘నవల’ లక్షణాలున్న ప్రబంధ యుగం నాటి గ్రంథం?
ఎ. గిరిజాకళ్యాం
బి. ప్రభావతీ ప్రదుమ్నం
సి. వసుచరిత్ర
డి. కళాపూర్ణోదయం
29. ‘వసు చరిత్ర’కు మూలం?
ఎ. స్కందపురాణం
బి. నన్నయ భారతం
సి. మారన మార్కండేయపురాణం
డి. తిక్కన భారతం
30. ప్రబంధాలలో ఏ రసానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది?
ఎ. శృంగార బి. అద్భుత
సి. కరుణ డి. హాస్య
సమాధానాలు
1. డి 2. సి 3. బి 4. ఏ 5. డి 6. సి 7. బి 8. సి 9. డి 10. ఏ 11. బి 12. ఏ 13. డి 14. సి 15. డి 16. బి 17. సి 18. సి 19. ఏ 20. బి 21. డి 22. సి 23. డి 24. ఏ 25. బి 26. డి 27. సి 28. డి 29. బి 30. ఏ
– నానాపురం నర్సింహులు
9030057994